శాసనసభ సమావేశాల్లో సభ సంప్రదాయాల విషయంపై మాట్లాడే సమయంలో జగన్ ఆచి తూచి మాట్లాడాడు.  మాట్లాడే ప్రతి మాట విలువైనదిగా, సూటిగా బలంగా ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్న బాబు ఇబ్బంది పడ్డాడు.  రెండు రోజు మాటల యుద్ధం వాడిగా వేడిగా సాగింది.  


సభలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి.  అలా ఉన్నప్పుడే సభకు గౌరవం ఉంటుంది.  సభ ఏకపక్షంగా కాకుండా అందరి సమక్షంలో  తీసుకునే నిర్ణయాలు ఆమోదం చెందాలి.  అధికారం ఉందికదా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను లాగేసుకొని ప్రతిపక్షం లేకుండా చేయడం ఇష్టంలేదని జగన్ అన్నారు.  


టిడిపికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు వైకాపాలోకి రావాలని చూస్తున్నారిని, వారిని రావాల్సిన అవసరం లేదని చెప్పినట్టు జగన్ అన్నాడు.  జగన్ సభలో చేసిన ఈ మాటలు ఎవరికీ ఎలా తగలాలి వాళ్లకు తగిలాయి.  తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ కాంగ్రెస్ కు చెందిన 12 ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది.  


ప్రతిపక్షం అంటూ లేకుండా చేసింది.  తెరాస ఏమోగానీ, తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ మాటలకు హర్షం వ్యక్తం చేశాయి.  చిన్నవాడైనా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, ఇలా ప్రతిపక్షం లేకుండా చేయడం సబబు కాదని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.  మరి తెరాస పార్టీ ఎలా స్పందిస్తోందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: