రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధుల అవసరం ఉంటుంది.  నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సి ఉంటుంది.  కేంద్రంతో వైరం పెట్టుకుంటే రావాల్సిన నిధులు రావు.  అభివృద్ధి కుంటుపడుతుంది.  ఫలితం అప్పులు పెరిగిపోతాయి.  ఇచ్చిన హామీలు నెరవేరవు.  

అందుకే విభేదాలు ఉన్నా.. కేంద్రంతో ఏ పార్టీ కూడా డైరెక్ట్ గా విభేదాలు పెట్టుకోవు.  2014 లో బీజేపీ తో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ.. చివరకు వచ్చే సరికి విభేదించి..  వైరం పెట్టుకుంది.  ఫలితం నిధులు రాలేదు.  జరగాల్సిన పనులన్ని ఆగిపోయాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.  

బాబు చేసిన తప్పును జగన్ చేయకూడదని అనుకుంటున్నారు.  అందుకోసమే.. వీలైనంతగా కేంద్రంతో సయోధ్యగా ఉండేందుకు సిద్ధం అవుతున్నాడు.  విభేదాలు ఉన్నప్పటికి కేంద్రంతో విభేదించ కూడదని తెలుసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయబోతున్నాడు జగన్.  

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుపతి సన్నివేశం.   తిరుపతిలో జగన్ తన విధేయతను చాటుకున్నాడు.  ఒదిగి ఉంటె మోడీ వాళ్లకు బాగా దగ్గరవుతాడని.. కావాల్సినవి చేసిపెడతారని తెలుసుకున్న జగన్.. మోడీతో అలానే ఉండేందుకు సిద్ధం అవుతున్నాడు.  ఈరోజు ఢిల్లీ వెళ్తున్న జగన్.. మోడీతో చర్చలు జరుపుతారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: