పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత 2019 ఎన్నికల్లో పోటీ చేసి కెలవం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగారు.  ఎన్నికల తరువాత ఏపీ లో చక్రం తిప్పాలని చూసిన పవన్ కు ఎదురు దెబ్బ తగిలింది.  అటు తెలుగుదేశం పార్టీ సైతం చతికిల పడటంతో.. వైకాపాకు తిరుగులేకుండా పోయింది. 

వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కోలుకోవాలని చూసినా అది కుదిరేవిధంగా లేదు.  తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలి.  ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజలు కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నారు.  2011లో ఏర్పాటైన వైకాపా 2019 అధికారంలోకి రాగలిగింది.  మరి 2014లో ఏర్పాటైన జనసేన 2024 వరకు కష్టపడితే కొంతమేరకు బలీయంగా ఎదగొచ్చు.  

దీనిని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ జనాల్లోకి ఏలాలి.  జనసేనతో పాటు అటు బీజేపీకి రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.  మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నిలబడ్డప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  తెలుగుదేశం పార్టీకి చాలా వరకు డ్యామేజ్ జరగడంతో దీనిని బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే, ఇప్పుడు జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి బలపడితేనే టిడిపికి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవకాశం దొరుకుతుంది.  అలా కాకుండా జనసేన పార్టీ అలసత్వాన్ని ప్రదర్శిస్తే.. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగటం ఖాయంగా కనిపిస్తోంది.  సో, పవన్ ఎదుగుతాడో లేక బీజేపీకి అవకాశం ఇస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: