2014 లో తెరాస పార్టీ విజయం సాధించిన తరువాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి.  కేటీఆర్, హరీష్ రావులకు మంత్రిపదవులు ఇచ్చారు.  హరీష్ రావుకు కెసిఆర్ తరువాత అంతటి పేరు ఉన్నది తెలంగాణాలో.  

అయితే, 2018 లో జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంది.  ఈ విజయం తరువాత కెసిఆర్ కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించింది.  పార్టీ పనులు చూసుకుంటే సరిపోతుందని ఆయనకు అప్పగించింది.  కానీ హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టారు.  

హరీష్ రావును పక్కన పెట్టడం అలానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ దెబ్బతినిందని వార్తలు వచ్చాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  16 స్థానాలు తమవే అని చెప్పిన కెసిఆర్, కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ, 2019 ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.  కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది.  ఇది కెసిఆర్ ను ఇబ్బంది  పెట్టింది.  హరీష్ రావును పక్కన పెట్టడం వలనే ఇలా జరిగిందనే  రూమర్ రావడంతో మరలా హరీష్ రావును, కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని వినికిడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: