సమాజ్ వాది పార్టీ నేత, రాంపూర్ MP అజాం ఖాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన హైలెట్ గా మారిన విషయం మనకు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మదర్సాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మదర్సాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు..

అజాంఖాన్ ఈ విషయంలో స్పందిస్తూ మదర్సాలలో గాంధీని చంపిన గాడ్సే, ప్రగ్య ఠాకూర్ లాంటి వ్యక్తులను తయారు చేయరని ఆయన చెప్పారు.ప్రజాస్వామ్యానికి ఇటువంటి వాళ్లు ప్రమాదకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు,మదర్సాలకు మంచి చేయాలి అనుకుంటే వారి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, బిల్డింగ్స్ ని నెలకొల్పాలని తెలిపారు.

మైనార్టీలకు స్కాలర్ షిప్ స్కాలర్షిప్లను పెంచితే బావుంటుందని తెలిపారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ "మదర్సాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకోవడమే కాకుండా, వారిని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని" తెలిపారు.

2014 ఎన్నికలలో కూడా ప్రధానమంత్రి మోడీ మదరసాల విషయంలో ఒక ప్రకటన చేశారు.ఆయన మాట్లాడుతూ మదర్సాలలో విద్యార్థులకు ఒక చేతిలో పవిత్ర గ్రంధమైన ఖురాన్ మరియు ఇంకో చేతిలో కంప్యూటర్ ఉండాలని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: