ఆంధ్రప్రదేశ్ రెండో సీఎంగా అసలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో పాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. వాస్తవంగా కనీసం మంత్రిగా కూడా పనిచేయని అనుభవంతో పార్టీ పెట్టి... ఏడు సంవత్సరాలలోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. జగన్ మనస్తత్వం ఎరిగిన నేత‌ల్లో కొంద‌రు జగన్‌కు పాలనలో అనుభవం లేకపోవడంతో పరిపాలన చేత కాదని ఎద్దేవా చేశారు. అయితే 10 రోజుల్లోనే జగన్ తానేంటో ప్రూవ్ చేసుకుని పలు సంచలన నిర్ణయాలతో జాతీయ రాజకీయాలకు ఆదర్శంగా నిలవడం విశేషం.


పాలనా పరమైన నిర్ణయాలు... వేగవంతమైన సంస్కరణల విషయంలో కాసేపు జగన్‌ను పక్కన పెడితే ఫిరాయింపుల విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను అని కరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు రాజకీయ మేధావులు సైతం జగన్ ను పార్టీలకు అతీతంగా ప్రశంసిస్తున్నారు. ఏపీలో విపక్ష టిడిపి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది. గత ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో 40 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను అనేక ప్రయోగాల ద్వారా తన వైపునకు తిప్పుకున్నారు. గత ఐదేళ్ల ట‌ర్మ్‌లో ఏపీలో అధికార టిడిపి... తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలు విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఎలా ? లాక్కోవాలని అనే అంశం మీద ప్రధానంగా దృష్టి సారించి జాతీయస్థాయిలో తీవ్రమైన విమర్శలకు గురి అయ్యాయి.


అటు కేసీఆర్... ఇటు చంద్రబాబు ఇద్దరూ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బలవంతంగా తమ పార్టీలోకి లాక్కుని వాళ్లకు ఏకంగా మంత్రి పదవులు కూడా కేటాయించడం తీవ్రమైన విమర్శలకు కారణమైంది. ఇక గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఎలా తమవైపునకు ప్రతి ఒక్కరు చూశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి టిడిపిని టార్గెట్ చేయాలని అనుకుంటే అసెంబ్లీలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి ఉండదు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో కూర్చునే అవకాశం ఉండదు.


ఇక జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం వైసీపీ వాళ్ళు ఓకే చెపితే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ మాత్రం ఫిరాయింపులను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించని... ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడవ‌న‌ని... ఇతర పార్టీలకు చెందిన వారు తమ పార్టీలోకి రావాలని అనుకుంటే ఆ పార్టీ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇదే విషయం జగన్‌ను జాతీయ రాజకీయాల్లో నే ఆదర్శవంతమైన నేతగా మిగిలేలా చేసింది. 


విచిత్రమేంటంటే గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కేసీఆర్‌కు 88 సీట్లతో తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. అయినా కేసీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఉండకూడదని.. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు. ఈ తరహా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని రాజకీయ మేధావులు సైతం తీవ్రమైన విమర్శలు వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ కు ఏమాత్రం పట్టడం లేదు. ఇక ఇదే టైంలో జగన్ తాను ఫిరాయింపులను ప్రోత్సహించని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు స్వాగతిస్తున్నాయి. జగన్ నిర్ణయాన్ని తెలంగాణలో రాజకీయ మేధావులు ఇతర పార్టీల నేతలు అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ విధానం జాతీయ రాజకీయాల్లోనే సంచలనం కాబోతుందని కూడా వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: