పాదయాత్ర చేసిన తరువాత ముఖ్యమంత్రులు అయ్యిన నాయకులు చాలామంది ఉన్నారు.  అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు, తరువాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు.  మొన్న రీసెంట్ గా ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు.  ఇలా పాదయాత్ర చేసిన ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. 

ఇదే బాటలో పవన్ కూడా పాదయాత్ర చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు.   గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమిపాలయ్యారు.  ఈ ఓటమి తరువాత పవన్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీని పక్కన పెట్టి ముందు కొన్ని సినిమాలు చేస్తారని, ఆ తరువాత పార్టీని ముందుకు నడిపిస్తారని వార్తలు వచ్చాయి. 

ఈ వార్తల్లో నిజం లేదని కొందరు అంటున్నారు.  ప్రజల్లోకి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారని, దానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని జెడి చెప్పినట్టు తెలుస్తోంది.  అయితే, పవన్ ఎప్పుడు పాదయాత్ర చేస్తారు.. ఎక్కడి నుంచి ఎలా మొదలుపెట్టబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తోంది.  

పాదయాత్ర చేయడం వలన కొంతమేర పార్టీని బలోపేతం చెయ్యొచ్చు.  పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంతో పోరాటం చెయ్యొచ్చు.  ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడిని తీసుకురావొచ్చు.  పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇదొక్కటే మార్గం.  అయితే, ఇది సమయం కాదు కాబట్టి కొంత సమయం చూసుకొని పాదయాత్ర చేస్తే బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: