ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు అప్పుడు తమ వ్యూహాలు పన్నుతున్నారు.  ఏ చిన్న కారణం దొరికినా దాన్ని బూతద్దంలో పెట్టి చూపించేందుకు పూనుకుంటున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికులలా తనిఖీలు చేయడంపై మాజీ మంత్రి చినరాజప్ప స్పందించారు.  విమానాశ్రయ సిబ్బంది తీరును తప్పుబట్టారు.

ఆయన మాజీ ముఖ్యమంత్రి అని..జాతీయపార్టీ అధినేత అని వీఐపీ, జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీలు చేయడం దారుణమన్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడంపైనా మాజీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..వైసీపీ నేతలు..సామాన్య ఆంధ్రప్రజ మాత్రం జగన్‌ను తనిఖీ చేయొచ్చు గాని నిన్ను తనిఖీ చేయడం ఏందయ్యా అంటూ వ్యంగాంగా ప్రశ్నిస్తున్నారు.  జగన్‌ను తనిఖీ చేసినందుకు ఎవరూ ఏమనలేదు.

నిన్ను తనిఖీ చేస్తే మేమెందుకు ఏడవాలయా?జగన్‌ను తనిఖీ చేస్తే సాక్షి కనీసం ఓ  ఫోటో కూడా వేయలేదు.నిన్ను తనిఖీ చేస్తే పచ్చ మీడియా దీన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తోందయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కుల పిచ్చి తమ్ములకు  ఈ రోజు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు సెక్యూరిటీ వాళ్లు తనిఖీ చేస్తే తప్పుగా కనబడుతుందని విమర్శిస్తున్నారు సామాన్య ప్రజలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: