ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో 10 మంది వలంటీర్లను నియమిస్తున్న విషయం తెలిసిందే. 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది.

 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు జులై 8 న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్   ఖరారు చేశారు. జులై 30 నుంచి ఆగస్టు 7 మధ్య మెరిట్ జాబితా విడుదల చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల నియామకానికి పంచాయతీ రాజ్ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.  మొత్తంగా ఆగస్టు 7 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.  ఆగస్టు 10 తరువాత రెండు లేదా మూడు రోజుల పాటు వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారని సమాచారం.  ఆగస్టు 15 వ తేదీ నుంచి వలంటీర్లు విధుల్లో చేరేలా విధి విధానాలతో ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: