ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన  వేళ..  ఆ పార్టీ భవితవ్యం పై కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.  ఓ వైపు చంద్రబాబుకు వయసు మీద పడటం...  మరోవైపు లోకేష్ నాయకత్వంపై సానుకూలత వ్యక్తం కాకపోవడం  కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది.

 

 

ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని  ఆదుకునేది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై  అనేకమంది స్పందిస్తున్నారు.  సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువు  అయిన  జెసి దివాకర్ రెడ్డి..  జూనియర్ పైనా కామెంట్లు విసిరారు.

 

 

 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం కొన్నాళ్ళు కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని జెసి అన్నారు.  జూనియర్ ఎన్టీఆర్ కష్టపడితే మంచి నాయకుడు అవకాశాలు ఉన్నాయని  జెసి జోస్యం చెప్పారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ పై సానుకూలంగా స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి..  పవన్ కళ్యాణ్ పై మాత్రం   కాస్త నెగిటివ్ గానే స్పందించారు.  పవన్ లాంటి వ్యక్తి కి రాజకీయాలు కరెక్ట్ కాదని తేల్చి చెప్పేశారు.  పవన్ లాంటి హీరోలను చూసేందుకు జనం వస్తారని కానీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: