విజయానికి మారుపేరు విజయవాడ.  ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఆ బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని హైదరాబాద్ అయితే, పారిశ్రామిక రాజధానిగా విజయవాడకు పేరుంది.  అక్కడి నుంచి నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. 

 

రాష్ట్రం విడిపోయాక.. విజయవాడ.. గుంటూరు పరిసర ప్రాంతాలను కలుపుకొని అమరావతిని రాజధానిగా చేసుకున్నారు.  విజయవాడలో ప్లేస్ చాలా తక్కువ. రద్దీ ఎక్కువ.  నగరానికి ఓ చివరిగా ఇంద్రకీలాద్రి ఉన్నది.  ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.  దీంతో అక్కడ ఫ్లై ఓవర్ ప్లాన్ చేశారు.  అప్పట్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 

 

కొంత పనులు పూర్తయ్యాక, వీటిని పక్కన పెట్టారు.  తెలుగుదేశం ప్రభుత్వం తరువాత వీటిని పట్టించుకోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.  ఎన్నికలకు ముందు జగన్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు విషయంలో హామీ ఇచ్చారు. 

 

ఇచ్చినట్టుగా డిసెంబర్ 31 వ తేదీ నాటికి ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని, న్యూఇయర్ కానుకగా బెజవాడ వాసులకు అందిస్తామని హామీ ఇచ్చారు.  జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. బెజవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: