ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. జులై రెండో వారంలో రాష్ట్ర శాసనసభలో ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం జులై 10న శాసనసభకు బడ్జెట్‌ సమర్పించే అవకాశం ఉంది.  పరిస్థితులను బట్టి ఈ తేదీ మారే అవకాశమూ ఉంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తయారు చేసి సభకు సమర్పించినా నాలుగు నెలల కాలానికే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదం పొందింది.

 

సోమవారం నాలుగు శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొన్ని సమావేశాల్లో మంత్రులు సయితం పాల్గొన్నారు. బడ్జెట్‌కు తుది రూపు ఇచ్చే క్రమంలో మరోసారి ఆర్థిక మంత్రి ఆయా శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. వాస్తవ అంచనాల ప్రాతిపదికగా బడ్జెట్‌ రూపకల్పన జరగాలని ఇప్పటికే బుగ్గన ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ రాబడులు కన్నా ఖర్చులు మరీ ఎక్కువయ్యే పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూసుకోవాలనే ఆలోచనా క్రమంలో కసరత్తు సాగుతోంది.

 

స్తుతం సమర్పించే బడ్జెట్‌ గత ప్రభుత్వం సమర్పించిన రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్‌ స్థాయికి చేరుతుందా అన్నది సందేహంగానే ఉంది. రెవెన్యూ రాబడులు, కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్‌ రూపకల్పన సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లకు చేరువలోనే ఉంటుందా? దాటుతుందా? అన్నది ఇతమిత్థంగా తేలాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు వైకాపా మేనిఫెస్టోలోని అంశాలను ప్రాతిపదికగా చేసుకుని వారి బడ్జెట్‌ ప్రతిపాదనలు సోమవారం రాత్రికల్లా ఆన్‌లైన్లో సమర్పించాలని ఇప్పటికే ఆర్థికశాఖ పురమాయించింది.

 

వెన్యూ లోటుపై సమగ్ర వాస్తవ లెక్కలు సిద్ధం చేయాలని ఆర్థికమంత్రి అధికారులకు సూచించారు. గతంలో రూ12,700 కోట్లు రెవెన్యూ లోటుగా లెక్కించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలతో రెవెన్యూ లోటుపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కచ్చితమైన లెక్కలు సిద్ధం చేసి వాటి ఆధారంగానే రెవెన్యూ లోటును కేంద్రం నుంచి డిమాండ్‌ చేసి తెచ్చుకోవాలనేదిగా ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఆ మేరకు ఆర్థికశాఖాధికారులు కసరత్తు సాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: