2015 నుంచి 2020 సంవ్సతరాల మధ్యలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తంగా గత ఐదేళ్లలో మన రెవెన్యూలోటు రూ.66,362 కోట్లకు పెరిగిపోయింది. ఇది 14వ ఆర్థికసంఘం అంచనా వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా ఉంది.

 

2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం 14,411గా ఉండగా, ఏపీ తలసరి ఆదాయం 8,398గా మాత్రమే ఉంది. కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లు, ఆర్థిక దుస్థితి దృష్టిలో ఉంచుకుని.. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని సక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రకటన చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని  నేరుగా ఆర్థిక సాయం చేయడం ద్వారా, అభివృద్ధికరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని ఆనాడు పార్లమెంట్‌లో చెప్పారు.

 

గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి.

 

గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల, ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానం పంపుతున్నాం. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని  అప్పటి ప్రభుత్వం సరిదిద్దక పోగా .. ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. అందుకే ఈరోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోంది అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: