కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణ సీఎం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని సీల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారు. ప్రాజెక్టు డీపీఆర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు పెట్టలేదని మండి పడుతున్నారు.

 

కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో బయటపెట్టామని ఆయన అన్నారు. 15 శాతం నిర్మాణానికే 50 వేల కోట్లు ఖర్చైతే మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేసిఆర్ విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడిస్తున్నారని భట్టి ఆరోపించారు.

 

15 శాతం నిర్మాణం కూడా  పూర్తి కాని ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభిస్తూ కేసిఆర్ రాష్ట్రానికి భారంగా మారుస్తున్నారని భట్టి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని భట్టి చెప్పుకొచ్చారు.

 

తెలంగాణ ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ని పిలిచారని భట్టి ప్రశ్నించారు.తెలంగాణ ఖజానాపై ఆర్థికభారం పడేలా వ్యవహరించిన వ్యక్తి ఫడ్నవిస్ అన్న భట్టి..నిజాలు బయటికి వస్తాయనే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అన్ని పార్టీలను పిలవలేదని భట్టి విక్రమార్క అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: