తాను బీజేపీలో వెళ్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే తాను ఎవరినీ బిజెపిలోకి రావాలని బలవంతం చేయనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం..

 " పార్టీ మారే ముందు నియోజక వర్గ ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాను. కొంత మంది యువకులు పార్టీ మారుతున్నాను అని ఇబ్బంది గా ఫీల్ అయ్యారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రజలు నన్ను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు.కార్యకర్తలను కాపాడుకుంటాను. రాబోయే రోజుల్లో మా నిర్ణయం హర్షించే విధంగా ఉంటుంది.

 

అవినీతి డబ్బు తో కేసీఆర్ మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేసాడు. డబ్బు,మద్యం ఆయనను గెలిపించాయి.మా సోదరుడు తన వ్యక్తిగత ఒపీనియన్ చెప్పారు.మా సోదరుడు కాంగ్రెస్ లో కొనసాగిన వారి ఒపీనియన్ ను నేను గౌరవిస్తాను.

 

 ఆర్ధిక పరమైన ఆలోచన తో నేను పార్టీ మారడం లేదు.కాంగ్రెస్ వాళ్లు రామేశ్వర రావు తో చీకటి ఒప్పందం చేసుకున్నారు. దేశంలో బీజేపీ పికప్ అవుతుంది. బీజేపీ జాతీయ వాదం తో ముందుకి వెళుతుంది. నేను ఎవ్వరిని పిలవలేదు.ఎవ్వరి వ్యక్తిగత నిర్ణయం వారిది "

మరింత సమాచారం తెలుసుకోండి: