తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే జగన్‌ను గెలిపించందన్నారు జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, సినీ నటుడు నాగబాబు. జనసేన ఓటమిపై కారణాలను వివరిస్తూ.. గురువారం నాడు ఫేస్ బుక్ లైవ్‌ను నిర్వహించారు నాగబాబు. ఈ సందర్భంగా నెటిజన్ల నుండి ఎదురైన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నాగబాబు.

 

ఈ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం. మేం జనంలోకి వెళ్లినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే.. అనుభవం ఉందని చంద్రబాబుని గెలిపిస్తే.. ఆయన ఏం చేయలేదు కాబట్టి.. చాలా కోపంగా ఉంది. ఈ తరుణంలో జగన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. పవన్‌పై నమ్మకం ఉన్నా.. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి.. పవన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరేమో అనిపిస్తుంది.

 

ఎన్నికల్లో ఓడిపోయినవాళ్లు చేతకాని వాళ్లు కాదు. నా వరకూ నేను ఇంకాస్త పనిచేసి ఉంటే గెలిచే వాడినేమో అనిపించింది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే దాంట్లో వాస్తవాలు ఎవరికీ తెలియదు. 10 శాతం ట్యాంపరింగ్ చేసినా ఫలితాల్లో చాలా తేడాలు వస్తాయి. అయితే ట్యాంపరింగ్ జరిగిందన్న దాన్ని తీసేయలేం. ఈ సందర్భంలో ఓడిపోయాం కాబట్టి ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నాం అని అనుకుంటారు.

 

జగన్ చేస్తున్న పనులపై మీ అభిప్రాయం చెప్పమంటే చెబుతాం.. అంతే కాని ఆయన చేసే మంచి పనులపై మీ అభిప్రాయం చెప్పమంటే ఎలా చెప్తాం. అది కరెక్ట్ ప్రశ్న కాదు. మొత్తానికి కొత్తగా జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పుడే ఇలా చేశారు.. అలా చేశారు అంటూ కరెక్ట్ కాదు. కొంత సమయం ఇద్దాం.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెడతారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: