కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ నగరంలో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. అతాగే వేర్వేరు వ్యవహరాలుగా పనులు ఉన్నాయని అన్నారు. కంటోన్మెంట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌వీఆర్‌ చంద్రశేఖర్‌ను ఆయన కలిశారు. కంటోన్మెంట్‌ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగు ప్రాజెక్టులపై చర్చించారు.

 

కంటోన్మెంట్‌ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. కంటోన్మెంట్‌లో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నదని, ఆస్తిపన్ను వసూలులో వ్యత్యాసం ఉన్నదని, బంగ్లాలను, లీజు స్థలాలను చాలా మంది ఏళ్లుగా ఆక్రమించి అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు.

 

అందుకే జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే అంశాన్ని ఉధృతం చేస్తామని, దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని వెల్లడించారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో, జింఖానా మైదానాలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడా అవసరం కూడా లేదన్నారు.

 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్లలో సదుపాయాలు, రైల్‌ ఓవర్‌ వంతెనలు, రైల్‌ అండర్‌ బ్రిడ్జీలు, ఎంఎంటీఎస్‌ రెండో విడత పనులు, శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ కనెక్టివిటీ, ఎంఎంటీఎస్‌ రెండో ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత వరకు చెల్లించినదీ, చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులు తదితర అంశాలపై జీఎంతో చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: