టీడీపీ కి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ లో చేరడం పై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విదేశాలలో ఉన్న ఆయన  ప్రకటన ద్వారా తన స్పందన తెలిపారు. టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే అండ అని..నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదని అంటున్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

"రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడింది. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బిజెపి పాల్పడటం గర్హనీయం. పార్టీ మారుతున్నటువంటి నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.

 

ఒకరిద్దరు నేతలు స్వార్థం కోసం పార్టీ జెండాను వదిలేసినా.. భుజానికెత్తుకుని మోసే కార్యకర్తలు లక్షలాదిమంది ఉన్నారు.రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీలో చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని పార్టీ మారిన నేతలు చెప్పటం అవకాశవాదానికి నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు వారాలు కాకముందే బిజెపి మైండ్‌ గేమ్‌కు పాల్పడుతోంది.

 

ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 37ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, అనేక ఆటుపోట్లను అధిగమించింది. ప్రజలు, కార్యకర్తలు ముందుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నడిపి పార్టీకి అండగా నిలబడి కాపాడుకున్నారు.

 

ఇప్పుడు మళ్లీ టిడిపిని ఇబ్బంది పెట్టాలని చూసినా, చీలికలు తేవాలని ప్రయత్నించినా కార్యకర్తలు, ప్రజలే తెలుగుదేశం పార్టీకి కవచాలుగా మారి కాపాడుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.సంక్షోభం ఎదురైనప్పుడల్లా తెలుగుదేశం పార్టీ మరింత బలపడింది, నూతన జవసత్వాలు పొందింది.  కార్యకర్తలు నిబ్బరంగా ఉండి, పార్టీపై జరుగుతున్న రాజకీయ దాడులను, భౌతిక దాడులను ధైర్యంగా ఎదుర్కోని నిలబడాలి."

మరింత సమాచారం తెలుసుకోండి: