తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  ఈరోజు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  నలుగురు బీజేపీలో చేరిన తరువాత రాష్ట్రంలో అలజడి మొదలైంది. 

 

 

తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఒక్కొక్కరిగా బీజేపీలో జాయిన్ కావడానికి పావులు కదుపుతున్నారు.  రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరిన తరువాత, లోక్ సభకు చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలవడం ఒకింత కలవరానికి గురిచేస్తోంది. 

 

 

టిడిపికి చెందిన ముగ్గురు ఎంపీలు టిడిపి తీర్ధం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  కేశినేని నాని ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధం కాగా, గల్లా జయదేవి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అటు రామ్మోహన్ నాయుడు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

 

 

వస్తున్న వార్తలను బట్టి చూస్తే... ముగ్గురు లేదంటే ఇద్దరైనా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి మారొచ్చని అంటున్నారు.  రేపోమారో దీనికి సంబంధించిన వార్తలు కూడా వస్తాయని అంటున్నారు.  ముగ్గురు ఎంపీలలో ఒక్కరు బీజేపీలో జాయిన్ అయినా అది టిడిపికి నష్టమే.


మరింత సమాచారం తెలుసుకోండి: