దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’... రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ  ముఖ్య  కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్‌ గిల్‌ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది.

 

పరిశ్రమ నెలకొల్పడంలో  సాధ్యాసాధ్యాలను  పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక   బృందాన్ని   పంపనున్నట్లు కొరియా  బృందం  ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి  పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వీటితో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

 

పోస్కో ప్రతిపాదనల్ని  పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టాలని  అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. పరిశ్రమలు-ఐటీ శాఖల మంత్రి  మేకపాటి గౌతంరెడ్డి,  అధికారులు పాల్గొన్నారు. చైనా నుంచి వచ్చిన ప్రతినిధి బృందం కూడా సీఎంతో విడిగా భేటీ అయింది.

 

ఇరువురు పెట్టుబడుల విషయంలో చర్చించినట్లు సమాచారం.  అదేగాని జరిగితే జగన్ రాజకీయ ప్రస్థానంలో ఇదొక కాలికుతురాయి అవుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.  ఎందుకంటే, నిరుద్యోగం మెండుగా ప్రబలిన మన రాష్ట్రంలో ముఖ్యంగా యువకులకు ఒక ఉపాధి గా మారుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: