సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీనివాసరావు (నాని) ప్రకటించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన వివిధ రకాలైన చర్యలపై చర్చించారు. పేదలకు అనుకూలమైన ఆహారమే ధ్యేయంగా పనులు చేపట్టారు.

 

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రస్తుతం రేషన్‌ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయన్నారు. తినడానికి పనికిరాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపుతున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న బియ్యంలో కూడా 25 శాతం నూకే వస్తుందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో పలు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను కోరారు.

 

నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతోందని వెల్లడించారు. అందుకే రేషన్‌ షాపుల్లో వినూత్న మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని సృష్టం చేశారు. దీనికి 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయన్నారు.

 

బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్ల భారం పడుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఏదిఏమైనా రాష్ట్రము లో బడ్జెట్ లో ఉన్నసరి, పేదలకు చేరవలసిన నిత్యావసరాలు చేరుతాయని చాలా కరాఖండిగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: