చేతిలో అధికారం ఉంటె ఏదైనా చెయ్యొచ్చు.  అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపితే ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచైనా బయటపడొచ్చు.  అందుకే చాలా మంది అధికారంలో ఉన్న పార్టీలవైపు మొగ్గు చూపుతుంటారు.  సుజనా చౌదరి విషయంలో కూడా ఇంచుమించుగా ఇదే జరిగింది.  


సుజనా చౌదరి తో పాటు మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, మోడీ పాలన నచ్చి పార్టీ మారినట్టు సుజనా పేర్కొన్నాడు.  ఇంత హడావుడిగా ఈ మార్పు రావడానికి కారణం ఏంటి.  


ఎందుకు సుజనా అకస్మాత్తుగా పార్టీ మారాల్సి వచ్చింది.  ఏం అంతకు ముందు పార్టీ మారొచ్చు కదా.  అంటే.. జూన్ 1 వ తేదీన జరిగిన సంఘటనతో ఈ  సుజనాలో మార్పు తీసుకొచ్చింది.  జూన్ 1 వ తేదీన సుజనా చౌదరికి చెందిన అనేక సంస్థలపై వరసగా సిబిఐ దాడులు జరిగాయి.  


ఆ దాడుల అనంతరం మరలా అంతా సైలెంట్ గా మారిపోయింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి.  కట్ చేస్తే.. సుజనాతో పాటు మరో ముగ్గురు ఎంపీలు పార్టీలు మారిపోయారు.  ఇలా జరగడానికి కారణం సుజనాపై ఒత్తిడి.  తన సంస్థలను కాపాడుకోవడానికి ఎలాంటి వాటికైనా సిద్ధం అని చెప్పకనే చెప్పాడు సుజనా.  అది అసలు సంగతి.  


మరింత సమాచారం తెలుసుకోండి: