సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ వాలంటీర్ల నియామకానికి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గ్రామ వాలంటీర్ల నియామకానికి రూపొందించిన విధి విధానాలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు. ధరఖాస్తులు ఈరోజు నుండి జులై 5 వరకు స్వీకరిస్తారు. ఈరోజు నోటిఫికేషన్ విడుదలైన తరువాత అభ్యర్థులు గ్రామ వాలంటీర్ల ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. 
 
జులై 11 నుండి ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆగష్ట్ 1 న వెల్లడిస్తారు. ఎంపికైన వారికి శిక్షణనిచ్చి ఆగస్ట్ 15 వ తేదీ నుండి గ్రామ వాలంటీర్లుగా ప్రజలకు సేవలు అందించేలా చేస్తారు. గ్రామ వాలంటీర్లకు ప్రతి నెల 5,000 రుపాయల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుంది. 
 
ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నారు. రాష్ట్రంలో ఈ గ్రామ వాలంటీర్ల నియామకం ద్వారా నాలుగు లక్షలకు పైగానే ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి గ్రామ వాలంటీర్ల ఉద్యోగానికి కనీస విద్యార్హత. రిజర్వేషన్ల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: