ఆంధ్రప్రదేశ్ లో సీబీఐకి ప్రవేశం లేదు.. ఇది కొన్నాళ్ల క్రితం మాట. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపీలోని టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిందని..అందుకే సీబీఐని తెలుగుదేశం నేతలపైకి ఉసికొల్పుతుందని.. అందుకే సీబీఐని ఏపీలోని రాకుండా నిషేధం విదించామని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధినేతలు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏపీలో సీబీఐ ఎంట్రీని అడ్డుకున్నారు. 


ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక.. ఇటీవల ఆ నిషేదాన్ని ఎత్తేశారు.. ఇక అంతే.. అప్పటి నుంచి తెలుగుదేశం నేతల్లో గుబులు మొదలైంది. రాష్ట్రంలో జగన్.. కేంద్రంలో మోడీ.. ఈ తాకిడి తట్టుకోవాలంటే.. సరండర్ అయితేనే మంచిదని ఫీలైనట్టున్నారు. 

అందుకే ఏకంగా బీజేపీలోనే చేరడం ద్వారా సీబీఐ, ఈడీ. ఐటీ వంటి కేసుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చని డిసైడైపోయారు. అందుకే ఇలాంటి కేసుల ఆస్కారం ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు అందరికంటే ముందే వెళ్లి బీజేపీ తలుపు తట్టేశారు. బాబుగారితో సంప్రదించారో లేదో తెలియదు కానీ.. కాషాయ కండువా కప్పేసుకున్నారు. 

ఇక ఇప్పుడు రాష్ట్రంలోని మిగిలిన టీడీపీ నేతల వంతు వచ్చింది. సీబీఐ, ఈడీ, ఐటీ కేసుల భయం ఉన్న నాయకులంతా బీజేపీ తలుపులు తడుతున్నారు. సాధారణంగా తీసే అవకాశం లేకపోతే.. ఏకంగా బాదుతున్నారు. ఎలాగైనా సరే కేసుల నుంచి కాపాడుకోవాలన్నదే వీరి అంతిమ లక్ష్యం.. తమ ఇబ్బందులు చంద్రబాబు కూడా అర్థం చేసుకుంటారన్న ధీమా వారికి ఉన్నట్టుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: