జనసేన పని అయిపోయిందని అంటున్న వారికి సినీ నటుడు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రానున్నది తమ పార్టీ ప్రభుత్వమేనని ఆయన  చెప్పుకొచ్చాడు.  రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని జరుగుతున్న ప్రచారాన్ని  తిప్పికొడుతూ, తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు అండగా రాజకీయాల్లో ఇకపై కూడా  కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


 నాగబాబు ఓడిపోయిన తరువాత మళ్ళీ జబర్దస్త్ టీవీ షో లో న్యాయనిర్ణేత గా  కొనసాగాలని నిర్ణయించుకోవడం, పలు సినిమాలను అంగీకరించడం తో... ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనన్న ఊహాగానాలు విన్పించాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేసేవిధంగా నరసాపురం సమస్యల పై మెగా బ్రదర్ దృష్టి సారించి తన వంతుగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నాడు. జనసేన ఘోర ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల పార్టీ నేతలతో సమావేశమై, ఓటమికి కారణాలను  సమీక్షించారు.


 రానున్న రోజుల్లో మరింత లోతుగా ప్రజల వద్దకు వెళ్లి ,  పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించగా, ఇప్పుడు నాగబాబు తన సోదరుడికి అండగా రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేయడం చూస్తే, రాజకీయాలను మెగాబ్రదర్స్ అంత తెలికగా ఏమి తీసుకుంటున్నట్లు కన్పించడం లేదని పరిశీలకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: