వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది.  జులై 10 నుంచి సమావేశాలు ప్రారంభమౌతాయి.  జులై 12 వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.  దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.  ఇందులో ఏ ఏ విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తారు అనే దానిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. 

 

రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఇందులో నవరత్నాలను కూడా చేరుస్తున్నారని తెలుస్తోంది.  ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారు.  ఈ హామీని నెరవేర్చడానికి జగన్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఎన్నికల దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను గత ప్రభుత్వం రూపొందించింది. 2014-15లో ఆంధ్రాపై అప్పుల భారం రూ.1,48,744 కోట్లు ఉండగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అది రూ.2,23,706 కోట్లకు చేరింది.

 

నవరత్నాల కోసం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు అన్నది తెలియాలి.  బడ్జెట్ లో ఎక్కువ భాగం దీనికోసమే కేటాయించనున్నారట.  బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: