ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోరాతి ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసినప్పటికీ గెలవకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. అయితే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2024 ఎన్నికలపైనే పవన్ కల్యాణ్ దృష్టి సారించారు.

 

భవిష్యత్ కార్యాచరణను ఉద్దేశించి,  ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల బాట పట్టి నేతలతో సమావేశమై భవిష్యత్తులో ఏమేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అనే విషయాలపై చర్చిస్తూ ముందుకెళ్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. జూన్-23 నుంచి పవన్ కల్యాణ్.. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ మారుతున్న నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు.

 

కాగా ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన నుంచి పలువురు కీలక నేతలు రాజీనామా చేసి బయటికెళ్లిన సంగతి తెలిసిందే. అంతేకాదు మరికొందరు నేతలు సైతం అదే బాటలో నడుస్తారని వార్తలు వస్తుండటంతో అలెర్టయిన పవన్ వారితో భేటీ అయ్యి బుజ్జగించే ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: