ఎటువంటి రాతపరీక్ష గాని, మార్కులను బట్టి గాని కాకుండా ఇంటర్వ్యూ ప్రాతిపదికనే గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆదివారం నాడు నోటిఫికేషన్లు విడుదల చేస్తారని, సోమవారం నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఏజెన్సీ అభ్యర్థులకు 10వ తరగతి, మైదాన, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌ను కనీస అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత దశలో రాతపరీక్షకు బదులుగా నేరుగా ఇంటర్వ్యూను నిర్వహించనున్నట్లు జిఓలో తెలిపారు. 'అర్హులైన దరఖాస్తుదారులనందరినీ ఎంపిడిఓ, తహసిల్ధార్‌, పంచాయతీ రాజ్‌ ఇఓలతో ఉన్న సెలక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది.

 

మెరిట్‌ ఆధారంగానే గ్రామవాలంటీర్లను నియమించాలని, ఇంటర్యూలు వద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం సాయంత్రం ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: