టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో మాత్రం చాలా భారీ మార్పులు చేపట్టారు. 2014లో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అనేక మంది సీనియర్లను ఈసారి పూర్తిగా పక్కకు పెట్టేశారు.


అయితే మంత్రి పదవులు లేకపోయినా పార్టీలో క్రియాశీలకంగా ఉండొచ్చు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ.. కొందరు గులాబీ సీనియర్లు మాత్రం అసలు వార్తల్లో కనిపించడమే మానేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. 

అలాంటి వారిలో నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ముందు వరుసలో ఉన్నారు. పార్టీలో చాలా సీనియర్లయిన వీరు ఇటీవల పూర్తిగా సైలంట్ అయ్యారు. మండలి ఛైర్మన్ గా పని చేసిన స్వామిగౌడ్, ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. 

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయనకు సామాజిక వర్గ సమీకరణ రీత్యా మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ గతంలో కూడా ఎమ్మెల్యేగా లేకపోయినా మంత్రి పదవి ఇచ్చి ఆదరించిన కేసీఆర్.. ఈసారి మాత్రం కరుణించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: