2014 లో మోడీ వేవ్ బలంగా ఉన్నది.  ఆసమయంలోనే బీజీపీకి 287 స్థానాలు మాత్రమే గెలుచుకోగా మిత్రపక్షాలతో కలిపి 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించింది.  అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చారు.  


వాటి వలన కొందరికి ఇబ్బందులు కలిగాయి.  మరికొందరికి కోపాన్ని తెప్పించాయి.  కానీ, ఫైనల్ గా మాత్రం మోడీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.  2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని భావించారు.  దానికి తగ్గట్టుగానే వేవ్ ఉంటుందని అనుకున్నారు. 

తీరా ఎన్నికలు జరిగాక పూర్తిగా మారిపోయింది.  ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.  ఏకంగా 303 స్థానాల్లో విజయం సాధించి తిరుగులేదని నిరూపించింది.  ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా భారీ విజయం సాధించింది.  తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది.  


అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన హావాను కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  తెలుగుదేశం పార్టీ కేడర్ ను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారు.  ఇదే జరిగితే.. జగన్ కు ఇబ్బంది ఇరకాటమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: