అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చుక్కలు చూపిస్తున్నారు. నార్త్‌ బ్లాక్‌లో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి రోజులో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నారు. ఉదయం 9:45 గంటలకు ఠంచనుగా ఆఫీసుకు చేరుకుంటున్న ఆయన రాత్రి పదీ- పదిన్నర గంటల వరకూ ఉంటున్నారు.

 

లంచ్‌ కూడా ఆఫీసులోనే! మధ్యాహ్నం 12: 45కు లంచ్‌ బ్యాగ్‌ ఆయన టేబుల్‌ వద్దకే వస్తుంది. ఇంటికి వెళ్లడం లేదు. అన్ని సమావేశాలూ ఆఫీసులోనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఆయనతో పాటు ఇద్దరు సహాయమంత్రులు, అధికారులు కూడా ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉండాల్సి వస్తోంది. అమిత్‌ షా వెళితేగానీ సీనియర్‌ అధికారులెవరూ కదలడానికి వీల్లేదు.

 

గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లోని కీలక మంత్రులు... అందరితోనూ నిరంతరం సమావేశాల్లో గడుపుతూ, అనేక ఇన్‌పుట్స్‌ తీసుకుంటూ, వాటిని తన జూనియర్‌ మంత్రులకు, అధికారులకు బదలాయిస్తూ పనిలో తలమునకలవుతున్నారు.

 

అక్కడికొచ్చి ‘కనబడి’ వెళ్లనివారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొందరు అధికారులైతే ‘‘ఇది డిప్యూటీ ప్రధాని కార్యాలయం’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అమిత్‌ షా రాకతో జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌ డోభాల్‌ పాత్ర పరిమితంగా మారింది. గతంలో అన్ని కీలక వ్యవహారాలూ డోభాల్‌ చేతుల మీదుగానే సాగేవి.


మరింత సమాచారం తెలుసుకోండి: