తెలుగుదేశం పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీ కి చెందిన నల్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . తాజా ఆ పార్టీ నాయకుడు, కాపునేత వంగవీటి రాధాకృష్ణ , జనసేన లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . ఈ మేరకు ఆయన,  జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది . అసెంబ్లీ ఎన్నికల కు రెండు నెలల ముందు వైకాపా అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో విభేదించి  రాధాకృష్ణ , టీడీపీ లో చేరిన విషయం తెల్సిందే.


టీడీపీ తరుపున ఎన్నికల్లో  పోటీ చేయకపోయినా , పార్టీ అధికారం లోకి వస్తే కీలక పదవి రాధాకృష్ణ కు దక్కడం ఖాయమని అందరూ భావించారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలుకావడం , వైకాపా అధికారం లోకి రావడం తో, రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు డోలాయమాన పరిస్థితుల్లో పడింది. టీడీపీ లో కొనసాగితే ఇక తనకు  రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తోన్న రాధాకృష్ణ , జనసేన లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు జనసేనాని తో విజయవాడ లో రెండు గంటలపాటు సమావేశమైన రాధాకృష్ణ , ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, భవిష్యత్తు కార్యాచరణ పై చరించినట్లు సమాచారం. రాధా చేరిక జనసేన కు మేలు చేయనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ లో బలమైన కాపు సామాజికవర్గం నేత గా ముద్రపడిన రాధాకృష్ణ చేరిక వల్ల , ఆ సామాజికవర్గం మరింత బలంగా జనసేనకు సపోర్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: