సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లోని హామీల్లో ఒకటైన అమ్మఒడి పథకంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్పష్టత వచ్చింది. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయబోతున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రిందట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ బడులకు మాత్రమే వర్తింపజేస్తున్నామని ప్రైవేట్ పాఠశాలలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.

 

ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇలా చెప్పటంతో ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ప్రకటించటంపై కొన్ని విమర్శలు రావడంతో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తేల్చింది.

 

ఈ పథకంపై మాత్రం ఏం చేసినా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ పథకం అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు మా పాఠశాలలో మీ పిల్లలను చదివించి 15000 రుపాయలు పొందండి అని ఫ్లెక్షీలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, చిన్న ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: