పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.  పవన్ తో పాటు జనసేన పార్టీ కూడా ఓడిపోయింది.  175 స్థానాల్లో ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది.  విజయం కోసం తీవ్రంగా శ్రమించినా.. ప్రజలు  పెద్దగా రిసీవ్ చేసుకోలేదు.  


దీనికి కారణాలు ఉన్నాయి.  పవన్ తన దృష్టి మొత్తం పట్టణాలపైనా, నాగరాలపైనా మాత్రమే పెట్టారు.  గ్రామాల్లో పెద్దగా ప్రచారం చేయలేదు.  గ్రామా స్థాయిలో పవన్ కు పట్టులేదు.  అందుకే ముందు అక్కడ దృష్టి పెట్టాలి.  గ్రామాల్లో కార్యకర్తలను పెంచుకోవాలి.  


స్థానికంగా బలంగా ఉంటేనే పార్టీ మనుగడ ఉంటుంది.  దీనిని గమనించిన పవన్ కళ్యాణ్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు.  గ్రామాల్లో యాక్టివ్ గా ఉంది పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.  త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.  


సార్వత్రిక ఎన్నికల కంటే.. లోకల్ గా తీసుకుంటే ఇవే ప్రధానమైన ఎన్నికలు.  ఈ ఎన్నికల్లో పట్టు సాధిస్తే.. పార్టీకి బలం చేకూరినట్టే.  అందుకే స్థానికంగా బలపడేందుకు పవన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  మరి స్థానిక ఎన్నికల్లో జనసేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: