ఉండవల్లి లోని ప్రజావేదిక కూల్చివేత పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ప్రజావేదిక ను ప్రస్తుత ప్రభుతం నేలమట్టం చేసిన విషయం తెల్సిందే . అయితే ఆ భవనాన్ని కూల్చి వేయకుండా ఉండి ఉంటే బాగుండేదని రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు  సైతం అభిప్రాయపడుతున్నారు . ప్రజావేదిక కూల్చివేత ద్వారా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనం బూడిద లో పోసినట్లయింది  వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .


రాష్ట్రం లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజావేదికను ప్రతిపక్ష నేత గా  వినియోగించుకునేందుకు తనకు కేటాయించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు . అయితే ప్రతిపక్ష నేత రాసిన లేఖ పై స్పందించని ముఖ్యమంత్రి , ఈ భవనం లో నిర్వహించిన  రెండు రోజుల కలెక్టర్ల సదస్సు లో మాట్లాడుతూ  ప్రజావేదిక అక్రమ , అవినీతి కట్టడమని దాన్ని, ఈ సమావేశం ముగియగానే  కూల్చివేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు . అయితే ప్రజావేదికను చంద్రబాబు కు కేటాయించడం ఇష్టం లేకనే , జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తమ్ముళ్లు మండిపడుతున్నారు.


ప్రజావేదిక ను కూల్చకుండా , కరకట్ట పై వెలిసిన అక్రమ నిర్మాణాల జోలికి ప్రభుత్వం వెళితే , ప్రభుత్వ భవనాన్ని కూల్చకుండా  ప్రైవేట్ భవనాలను ఎలా కూల్చుతారని ప్రశ్నించే అవకాశం ఉంటుందనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ప్రజాధనం బూడిద లో పోసిన పన్నీరు అయిందన్న వాదన కరెక్టే . గత   పాలకులు తాము నిర్ణయాలు తీసుకునేటప్పుడే జవాబుదారిగా వ్యవహరించి ఉంటే , ప్రస్తుత ప్రభుత్వం ప్రజాధనం తో నిర్మించిన భవనాన్ని కూల్చే అవకాశం ఉండేది కాదని వైకాపా నేతలు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: