మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎలక్షన్లలో పోటీ చేసాడు. కేవలం ఆ ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే సాధించగలిగాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసాడు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు.గత కొన్నేళ్ళుగా రాజకీయపరమైన అంశాలపై కూడా ఎటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారు చేయట్లేదు. 
 
ప్రస్తుతం చిరంజీవి గారికి సినిమాలు తప్ప మరో ధ్యాస లేదు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు చిరంజీవి. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇవి కాక మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో సొంత తమ్ముడి పార్టీ జనసేన పోటీలో ఉన్నా ఆ పార్టీ బహిరంగంగా జనసేన పార్టీ గురించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 
 
కానీ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఎవరో ఇలాంటి వార్తలు కావాలని పుట్టించారు. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలంటే జనసేన పార్టీ ఉంది. సొంత పార్టీ ఉన్నప్పుడు బయటి పార్టీలతో అవసరం ఉండదు. అంతేకాక చిరంజీవికి రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి చిరంజీవి బీజేపీలో చేరుతున్నాడన్న వార్త పూర్తిగా అవాస్తవం. 



మరింత సమాచారం తెలుసుకోండి: