ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, టీడీపీ కాపు నేతల సమావేశం, ప్రజావేదిక కూల్చివేత.. ఇలా పలు పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.

 

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు తన నివాసంలో బుధవారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు నేతలు హాజరుకాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో ఉన్నప్పటికీ విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.

 

బోండా ఉమా మహేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, పంచకర్ల రమేష్ బాబు కూడా చంద్రబాబు సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కాపు నేతల సమావేశంలో ఈ ముగ్గురూ పాల్గొన్న విషయం తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ మాజీలంతా బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

 

దీంతో చంద్రబాబు సమావేశానికి వీరు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం జోరందుకుంది. గైర్హాజరైన కాపు నేతలంతా ప్రైవేట్‌గా ఓ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. చూస్తుంటే వున్న అతి కొద్దిమంది ఎం.ఎల్.ఏ లు కూడా నెమ్మదిగా వలసలు పోతారని విస్వసనీయ వర్గాల సమాచారం...


మరింత సమాచారం తెలుసుకోండి: