కృష్ణానదీ తీరంలో నిర్మించిన చంద్రబాబు నివాసాన్ని కూల్చివేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని  తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.  జగన్ కేవలం కక్షసాధింపు కోసమే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు  విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబును  రోడ్డున పడ్డ వేయాలని  జగన్ ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  ఆయన ఇంకా ఏమన్నారంటే...

 

" ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షమూ అంతే ముఖ్యం.ప్రతిపక్షం ఎక్కడ అణగదొక్కుతున్నారో.. అక్కడ ప్రజాస్వామ్యం దెబ్బ తింటోంది.30 రోజుల పాలనలో ప్రజా సమస్యలపై జగన్ ఫోకస్ పెట్టారా..?

 

చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాధిస్తున్నారు. చంద్రబాబుకు భద్రత తగ్గించారు. వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ భద్రత జోలికి రాలేదు. ప్రజా వేదికను కూలుస్తున్నారని భావించి ఉంటే ప్రజా వేదికను అడిగేవాళ్లమే కాదు.

 

చంద్రబాబు ఇంటిని కూలదొస్తామని నోటీసులు ఇచ్చారు. ప్రజలు జరుగుతోన్న పరిణామాలు గమనించాలి. అనుమతుల్లేకుండా కట్టడాలు కట్టారంటూ నిర్మాణాలు కూల్చేస్తున్నారు. చంద్రబాబును రోడ్ మీద పడేసేందుకు జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది.

 

కష్టకాలంలో ఏపీకి వచ్చి.. ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నాం. సీఆర్డీఏ ఈ భవనాన్ని తీసుకుంటే ప్రభుత్వ భవనంగా మారుతుందని భావించాం. సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందే 2015లో. ఈ భవనాన్ని గ్రామ పంచాయతీలో అనుమతి తీసుకునే నిర్మించారు. 2011లోనే ఈ భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వ్యవసాయ భూమిలో నిర్మాణం చేసుకున్నందుకు రూ. 18 లక్షల మేర నాలా పన్ను కట్టారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారమే చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని నిర్మించారు."

మరింత సమాచారం తెలుసుకోండి: