ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రి.  ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.  


ఇది బీజేపీకి నిజంగా షాక్ ఇచ్చే అంశమే.  బీజేపీకే కాదు.. అన్ని పార్టీలకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.  మాములుగా ప్రాంతీయ పార్టీలు వారసత్వంతో నడుస్తుంటాయి.  బీజేపీలో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు వారసత్వ రాజకీయాలు నడుస్తుంటాయి.  యూపీ బీజేపీలో ఇకపై అలా జరగదని యోగి ఆదిత్యనాధ్ చెప్పారు.  


రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేల వారసులు, బంధువులు పోటీ చేయడానికి వీలులేదని ఖరాకండిగా చెప్పేశారు.  కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు ఈసారి అవకాశం కల్పించాలని యోగి ఆదిత్యనాధ్ నిర్ణయం తీసుకున్నారు.  


ఇది ఆహ్వానించదగిన విషయమే అని చెప్పాలి.  ఎందుకంటే వారసత్వ రాజకీయాల వలన దేశంలో రాజకీయాలు అవినీతిమయంగా మారిపోయాయి.  దీని నుంచి బయటపడాలి అంటే కొత్త కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి.. వాళ్ళ తమ ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించాలి.  యూపీ బీజేపీ తీసుకున్న నిర్ణయం బాటలో ప్రాంతీయ పార్టీలు ఏకీభవిస్తాయా..?


మరింత సమాచారం తెలుసుకోండి: