నదీ జలాల వినియోగంపై  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ శుక్రవారం సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.  ఉమ్మడి రాష్ట్రం లోని  నదీజలాలపై సీఎం కేసీఆర్ కు బ్రహ్మాండమైన పట్టు ఉంది.

 

కెసిఆర్ గతంలోనూ తెలంగాణ అసెంబ్లీలో నదీజలాలు ప్రాజెక్టులు అనే అంశంపై  గంటల తరబడి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఈ తాజా సమావేశంలోనూ కెసిఆర్ కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మంత్రులు అధికారుల ముందు పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర,  కర్ణాటక ఈ నదుల పై ప్రాజెక్టులు కట్టుకొని నీరు కిందకు రాకుండా చేస్తున్నాయో వివరించారు.

 

కేసీఆర్ అలా అనర్గళంగా నదీ జలాల వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఏపీ సీఎం జగన్ సహా అంతా అలా చూస్తూ ఉండిపోయారట.  కెసిఆర్ పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్  దాదాపు రెండు గంటల పాటు  సాగిందట.

 

అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయులా  కేసిఆర్ వివరిస్తుంటే...  బుద్ధిమంతుడైన విద్యా ర్థి లా  జగన్ శ్రద్ధగా  ఆలకించారట.  మొత్తం మీద రెండు రాష్ట్రాలు ఏకతాటిపై నడిచి కృష్ణా గోదావరి నదీ జలాలను తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేలా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: