సోషల్ మీడియా వేదిక అధికార , ప్రతిపక్ష పార్టీ నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు . నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తుంటే , రెండు పార్టీల అభిమానులు  అభ్యంతరకర పోస్టింగ్ లతో రెచ్చిపోతున్నారు . ఈ విషయాన్ని ఇరు పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం , ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు  షరా మామూలయింది . తాజా విజయసాయి రెడ్డి పై సోషల్ మీడియా వేదిక టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న , దివ్యవాణిలు తీవ్ర ఆరోపణలు చేశారు  


ముఖ్యమంత్రి ఇంటి ముందు వేసిన రోడ్డు కు ఐదు కోట్ల రూపాయలు భారతి సిమెంట్స్ నుంచి చెల్లించారా? అని ప్రశ్నించిన దివ్యవాణి , జగన్ ప్యాలెస్ వద్ద బారికేడ్ల నిర్మాణానికి 75 లక్షల రూపాయలు కార్మెల్ ఏషియా నుంచి చెల్లించారా??  అంటూ విజయసాయి ని నిలదీశారు . జగన్ ఇంటివద్ద మరుగుదొడ్ల నిర్మాణం కోసం అయిన 30 లక్షల ఖర్చు జగతి పబ్లికేషన్స్ ద్వారా చెల్లించారా అంటూ అపహాస్యం చేశారు . 


అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయసాయి తనదైన శైలిలో టీడీపీ అధినేత చంద్రబాబు , టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే . విజయసాయి విమర్శల పట్ల తొలుత పెద్దగా స్పందించని టీడీపీ నేతలు ఇప్పుడు ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది . దానికోసం సోషల్ మీడియా ను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం . 


మరింత సమాచారం తెలుసుకోండి: