జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చకచకా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.  ఇలా ఒకవైపు సుపరిపాలన అందిస్తూనే.. గతంలో తనకు జరిగిన పరాభవానికి బదులు తీర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో.. ఎక్కడ ఎవర్ని ఎలా వంచాలో.. ఎవరిని ఎలా ఎదిరించాలో గత ఐదేళ్ళలో జగన్ నేర్చుకున్నాడు.  జగన్ను మానసికంగా, ఆర్ధికంగా దెబ్బగొట్టిన వ్యక్తులపై కసి తీర్చుకోవడానికి సిద్ధంఅయ్యాడు.  ఇది కూడా పర్సనల్గా కాకుండా ప్రజాక్షేత్రంలోనే. 


కరకట్టపై ఉన్న నిర్మాణాల పేరుతో ప్రజావేదికను కూల్చేవేశారు.  విమర్శలు ఎదురైనా సరే లెక్కచేయలేదు.  లక్ష్యం ఒక్కటే కంటిముందు ఉన్నది.  ఒక్క ప్రజావేదికతో ఆపలేదు.  బాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు.  


పాపం తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లు వెతుక్కోవాల్సి వచ్చింది.  ఇలా కరకట్టపై ఉన్న ఇంటిమీదనే కాకుండా.. వైజాగ్ లో ఉన్న టీడీపీ కార్యాలయంపై కూడా దృష్టి పెట్టారు.  అక్రమంగా పార్టీ ఆఫీస్ ను నిర్మించారని, నోటీసులు ఇవ్వడంతో నేతలు ఖంగుతిన్నారు.  గంటాతో పాటు కొంతమంది టిడిపి నేతలు మీడియా ముందుకు వచ్చి లబోదిబో అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: