తెలుగుదేశం పార్టీ ఇప్పటికే డీలా పడింది.  అయినప్పటికీ ఆ పార్టీని వదలడం లేదు బీజేపీ.  వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నది.  ఆ పార్టీకి చెందిన నేతలను తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే కొంతమందిని తమవైపు తిప్పుకుంది.  త్వరలోనే ఇంకొందరు పార్టీలో చేరబోతున్నారు.  


తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు.  ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీలో చేరుతున్నారు.  వీరితోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.  


ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం మాత్రం తెలియడం లేదు.  గంటాతో సహా 12 మంది పార్టీ మారబోతున్నారని, వీరంతా ఈనెల 6 వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలు ఎంతవరకు నిజం అనే సంగతి తెలియాలి. 


అయితే, కొంతమంది మాత్రం ఎన్నికలు వచ్చే వరకు ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయని, ఎన్నికల నాటికి మరలా రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయం అని అంటున్నారు.  బీజేపీ మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తోంది.  ఎలాంటి పరిస్థితుల్లో కూడా టిడిపితో పొత్తు ఉండదని ఖరాకండిగా చెప్పేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: