గత ఎన్నికల్లో టిడిపి ఓటమికి జనసేన ఒక కారణం అని విశ్లేషిస్తున్నారు.  2014 ఎన్నికల్లో టిడిపి గెలవడానికి జనసేన ఒక కారణం అయ్యింది.  జనసేన మద్దతు ఇవ్వడం వలన గెలిచింది.  మధ్యలో అభిప్రాయ భేదాలు, ఇచ్చిన హామీల విషయంలో టిడిపి వెనక్కి తగ్గడంతో జనసేన ఒంటరిగా పోటీ చేసింది.

దీంతో ఓట్లు చీలిపోయాయి.  తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు జనసేనకు పడ్డాయి. ఓట్లలో చీలిక రావడం.. వైకాపాకు కలిసి వచ్చింది.  పైగా రెండు పార్టీల మధ్య ఓటర్లలో నిరాశా ఉండటంతో.. అందరు వైకాపాకు అవకాశం ఇచ్చారు.  ఇప్పుడు మరలా ఈ రెండు పార్టీలు కలిసిపోతాయని వార్తలు వస్తున్నాయి.  


కాపు ఓటర్లను ఆకర్షించాలంటే రెండు పార్టీలు కలిసి పనిచేయాలి.  అప్పుడే ఆ ఓటర్లు పార్టీకి ఓటు వేస్తారు.  లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. జనసేన ఎప్పటికి ఒంటరిగానే పోటీ చేస్తామని, టిడిపి తో పొత్తు పెట్టుకోవడం కల్లా అని అంటోంది.  పైగా వైకాపా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు జనసేన వత్తాసు పలుకుతుండటం చూస్తుంటే.. జనసేన వైకాపాకు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది.  


వచ్చే ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం అన్నది కల్లా.  పార్టీ పూర్తిగా బలహీన పడింది.  తిరిగి బలం పుంజుకోవాలి అంటే ఆ పార్టీకి బలమైన క్యాడర్ కావాలి. చాలా వరకు క్యాడర్ తగ్గిపోయింది.  బాబుగారి మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.  మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: