సంచలన నిర్ణయాలకు మారుపేరుగా మారుతున్నారు జగన్.  అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వేగవంతమైన అర్ధవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే వాటిని అమలు చేయడంలో వెనకడుగు వేయడం లేదు.  ఇప్పుడు అలాంటిదే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రతి మనిషికి ముఖ్యమైనవి మూడు ఉంటాయి.  


కూడు గుడ్డ నీడ.  ఈ మూడింటి కోసమే మనిషి కష్టపడుతుంటారు.  ఏవి లోపించినా మనిషి జీవన విధానంలో లోపం ఏర్పడుతుంది.  కూడు ఎలాగోలా కష్టపడి సంపాదించుకుంటున్నారు.  సమాజంలో బ్రతకడానికి ఏదో ఒక గుడ్డ కప్పుకుంటున్నాడు.  మిగిలింది నీడ.  ఇదే ఇప్పుడు కష్టంగా మారింది.  


ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది.  కొందరే ఆ కలను నెరవేర్చుకోగలుగుతారు.  సొంత ఇంటిని నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదు.  అది పేదవాడికి అందని ద్రాక్ష లాంటిది.  అందుకే ముఖ్యమంత్రి జగన్ దీనిపై దృష్టి పెట్టారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడికి తప్పని సరిగా ఇల్లు ఉండాలని, ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేయాలని సంకల్పించుకున్నాడు.  


పేదవాళ్లకు గృహాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని గృహనిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.  ఉగాది నాటికి అర్హులైన వాళ్లకు ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు జగన్.  ఒకవేళ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయగలిగితే.. రాష్ట్రంలో జగన్ కు తిరుగుండదు.  మరో పదేళ్ళపాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగలుగుతారు అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: