టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది అని చెబుతూనే ఉండేవారు. కానీ ఆయన ప్రతి కార్యక్రమంలోనూ విపరీతంగా ఖర్చు చేసేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో.. కన్వెన్షన్ సెంటర్లలోనే చేసేవారు.


వీటికి బిల్లులు కోట్ల రూపాయల్లో వచ్చేవి. అయినా ఆయన లక్ష్య పెట్టేవారు కాదు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఖర్చును సాధ్యమైనంత వరకూ తగ్గిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ల జోలికి వెళ్లడం లేదు.


ఇందుకు తాజా ఉదాహరణ.. కొత్త ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. గతంలో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఖరీదైన హోటళ్లలో జరిగేవి. కానీ జగన్ సర్కారు ఎలాంటి వృధా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.


గత ప్రభుత్వం ఎమ్మెల్యే లకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటల్ లో విందులు, డాన్సులతో ప్రజా ధనాన్ని వృధా చేసిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అంటున్నారు. సభాసంప్రదాయాలను నూతన ఎమ్మెల్యేలకు పరిచయం చేసేందుకు శాసన సభలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని మరో మంత్రి కన్నబాబు తెలిపారు. గత శాసన సభకు ఈ శాసన సభకు వ్యత్యాసం చూపిస్తామంటున్నారాయన.


మరింత సమాచారం తెలుసుకోండి: