వైఎస్ జగన్ పుట్టకతోనే శ్రీమంతుడు.. తండ్రి సీఎం అయ్యాక రాజకీయాల్లో అడుగుపెట్డాడు.. తండ్రి మరణం తర్వాత ఆయన వారసుడిగా జనంలోకి వెళ్లారు. అయితే జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కొన్నిరోజుల్లో ఉదయం నాలుగు గంటలకే లేచేవాడట.


మరీ అంత ఉదయమే లేచి ఏం చేసేవారు.. ఎందుకోసం అంత పొద్దున్నే లేచేవారు. తాజాగా ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో జగన్ తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆ సమయంలో ఈ విషయం బయటపెట్టారు.


జగన్ ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో మాట్లాడేందుకు ఉదయం నాలుగు గంటలకే లేచిప్రిపేర్ అయ్యేవాడట. అప్పట్లో సోమయాజులు గారు, జీవీడి కృష్ణమోహన్ ఆయన ప్రసంగాలకు తగిన డేటా అందించేవారట. వారి సహకారంతో అసెంబ్లీలో ఏ ఏ అంశాలు ఎలా మాట్లాడాలో చర్చించేవారట.


జగన్ తో పాటు పార్టీ ముఖ్యులు ముగ్గురు, నలుగురు కూడా ఉదయం నాలుగు గంటలకే వచ్చేవారట. అంతా కలసి ఆ రోజు అసెంబ్లీ వ్యూహం ఖరారు చేసేవారట. అదన్న మాట సంగతి.. ఓ పరీక్షకు వెళ్లే విద్యార్థిలా జగన్ ప్రిపేరయ్యేవారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: