తెలుగుదేశం పార్టీ పై ఆ పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత పలువురు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు విన్పించాయి . అయినా పార్టీ పట్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి విధేయత ను ప్రదర్శించారు . ఎన్టీఆర్ హయాం లో తనకు తగిన గౌరవం లభిస్తే , బాబు జమానా లో తనకు కనీస గౌరవం కరువయింది ఆవేదన వ్యక్తం చేశారు . బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు , టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి .


1982 లో ఎన్టీఆర్ తనని పిలిచి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా ల కన్వీనర్ గా నియమించి , ఎన్నికల సమయం లో బీ ఫామ్ ఇచ్చేటప్పుడు తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునేవారని చెప్పుకొచ్చిన బుచ్చయ్య చౌదరి , గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాం లో తనకు కనీస, గౌరవ, మర్యాదలు లభించలేదని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయం లో పార్టీ నాయకత్వం తో విభేదించడం వల్లే, తనని దూరం పెట్టారని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసి , పార్టీ విధేయులైన వారు కూడా, ప్రస్తుతం పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు చేయడం, క్యాడర్ ను విస్మయానికి గురి చేస్తోంది . బుచ్చయ్య చౌదరి వంటి వారు పార్టీ మారుతారని అనుకోవడం లేదని , కానీ ఇప్పటికైనా పార్టీ నాయకత్వం సీనియర్ల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు .  టీడీపీ నాయకత్వం ఎంతవరకు బుచ్చయ్య చౌదరి వంటి వారి సూచనలు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: