ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణుఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రగిలిపోతున్నారు. ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోందని ఆ దేశంపై చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ కూడా చేశారు. ఇరాన్ ను ఒంటరి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ దిగిరాకపోవడం అమెరికాకు కోపం తెప్పిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి.


2015లో జరిగిన అణుఒప్పందం ప్రకారం అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేస్తామని ఇరాన్ అంగీకరించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు పాటిస్తామని ఆ నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో అమెరికా ఒప్పందాల నుంచి స్వచ్చందంగా వైదొలగింది. ఇరాన్ పై ఆంక్షలు విధించింది. దీంతో తాము అణు ఒప్పంద పరిమితులు దాటుతామని ఇరాన్ ప్రకటించి.. గత నెలలో శుద్ది చేసిన యురేనియం నిల్వలను అమాంతం పెంచేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ కూడా ధృవీకరించింది. అప్పట్నించి అమెరికా – ఇరాన్ మధ్య సంబంధాలకు బీటలు వారాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణ్వస్త్ర చర్యలు ప్రపంచానికి ముప్పని, కొత్త ఒప్పందానికి సిద్దమని, సమస్యను పరిష్కరించుకుందామని ప్రకటించారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇరాన్ నిఘా డ్రోన్ కూల్చేసింది. ఈ చర్యతో ఇరాన్ పై అమెరికా రగిలిపోతోంది. చర్యకు ప్రతిచర్యగా ఇరాన్ పై క్షిపణి దాడికి సిద్దపడ్డ అమెరికా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది.  తాజాగా ఇరాన్ ఆర్మీ కంప్యూటర్ సిస్టంపై అమెరికా సైబర్ అటాక్ కూడా చేసింది. ఇరాన్ దేశ రాకెట్, మిసైల్ లాంచర్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.  అమెరికాలోని ఆర్ధిక, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలకు మెయిళ్లను పంపి ఇరాన్ హ్యాకింగ్ కు పాల్పడిందని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు చెబుతున్నాయి. 


ఈ చర్యలపై రెండు దేశాలూ స్పందించలేదు. ఇరాన్ మాత్రం అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. తమతో యుధ్దానికి సిద్దమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను హెచ్చరిస్తోంది. అమెరికా తన సైనికుల ప్రాణాలు కాపాడుకోవాలని సలహాలిస్తోంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఇరాన్ వసూలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: