ప్రధాని మోడీ తో వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు  భేటీ కావడం హాట్ టాఫిక్ గా మారింది . మోడీ ని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని  రఘురామకృష్ణం రాజు  చెప్పుకొచ్చారు . అయితే వీరిద్దరు  20 నిమిషాలపాటు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది . మోడీ తో రఘురామ కృష్ణంరాజు భేటీ వెనుక మర్మం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు .  అసలే ఏపీ లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలన్న ఉత్సాహం తో ఉన్న బీజేపీ నాయకత్వం , వైకాపా ను కూడా టార్గెట్ చేస్తోందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .


 ఈ అనుమానాలను నిజమేనని రీతి లో  ఏపీ  బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి . రాష్ట్రం లో బీజేపీ లో చేరేందుకు ఒక్క టీడీపీ నేతలే కాదని వైకాపా నాయకులు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు . ఢిల్లీ లో మోడీ తో,  రఘురామకృష్ణం రాజు భేటీ సందర్బంగా రాష్ర్ట  బీజేపీ కీలక నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .  రఘురామకృష్ణం రాజు ఎన్నికల ముందు వరకు టీడీపీ తరుపున నరసాపురం తరుపున పోటీ చేయాలని భావించారు .


 కానీ చివరి నిమిషం లో ఆయన వైకాపా లో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు .  రఘురామకృష్ణం రాజు అంతకుముందు బీజేపీ లో కొనసాగారు . బీజేపీ నుంచి టీడీపీ లో చేరిన ఆయన , ఆతరువాత వైకాపా కండువా కప్పుకుని పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పటికీ , ఇంకా  రఘురామకృష్ణం రాజు  మనసు ఏమైనా బీజేపీ వైపు లాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: